రోజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీపూర్ణిమ‌

Sree Poornima to be unveiled by YS Jagan
Monday, July 15, 2019 - 08:30

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రాసిన  మహాగ్రంథం `శ్రీపూర్ణిమ`. సుమారు 800 పేజీలతో పరమాత్మ లాలిత్యాన్ని అనేక స్తోత్రాలతో, అనేక లలిత లలిత పదబంధురాల వ్యాఖ్యానాలతో దర్శనమిస్తున్న ఈ `శ్రీపూర్ణిమ‌` మ‌హాగ్రంథానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇండ‌స్ట్రియ‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ శ్రీమ‌తి రోజా స‌మ‌ర్పిస్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ గ్రంథాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు.

ఇప్ప‌టికే వంద పైచిలుకు గ్రంథాల‌ను ర‌చించి, అద్భుతంగా ప్ర‌చురించి ఆధ్యాత్మిక మార్గంలో విల‌క్ష‌ణ విశిష్ట భూమిక సంత‌రిచుకున్న పురాణ‌పండ శ్రీనివాస్ ఈ గ్రంథాన్ని మేలిమి విలువ‌ల‌తో, నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో అద్భుతంగా ప్ర‌చురించ‌డాన్ని పండిత పామ‌ర వ‌ర్గం చేత వ‌న్స్‌మోర్ కొట్టిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.