రివ్యూల‌ను గౌర‌విస్తా: హీరో మాట‌

Sree Vishnu clarifies on VBVR
Monday, October 29, 2018 - 18:45

"వీరభోగ వ‌సంత‌రాయ‌లు" అనే ఒక సినిమా గ‌త వారం విడుద‌లైంది. ఈన్యూస్ చ‌దువుతున్న మీలో చాలా మందికి ఇలాంటి సినిమా ఒక‌టుంద‌ని కానీ, అది విడుద‌లై పోయింద‌ని కానీ తెలిసుండ‌క‌పోవ‌చ్చు. ఐతే ఈ సినిమాని చూసి క్రిటిక్స్ కి ఈ ద‌ర్శ‌కుడి నేరేష‌న్‌కి చికాకు వేసింది. క‌థ‌గా పాయింట్ బాగున్నా..నేరేష‌న్ గంద‌ర‌గోళంగా ఉండ‌డం, ప్రొడ్య‌క్ష‌న్ వాల్యూస్ మ‌రీ నాసిర‌కంగా ఉండ‌డంతో క్రిటిక్స్ అంతా త‌క్కువ రేటింగ్ ఇచ్చారు.

లాజిక్ లేక‌పోయినా మేజిక్ అయినా ఉండాలి. ఈ సినిమాలో రెండూ కొర‌వ‌డ్డాయి. ఉన్నమాట రాస్తే స్వీక‌రించ‌లేని గుణ‌మే మ‌న సినిమా సెల‌బ్రిటీల్లో ఉంటుంది.

ఈ సినిమా ద‌ర్శ‌కుడికి ఇది న‌చ్చ‌లేదు. కొత్త ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన‌కి మూడు రోజుల క‌లెక్ష‌న్స్ చూసిన త‌ర్వాత మేట‌ర్ అర్థ‌మైంది. క్రిటిక్స్‌కే కాదు ప్రేక్ష‌కుల‌కి కూడా న‌చ్చ‌లేద‌ని తెలిసింది. సినిమా చూసిన క్రిటిక్స్... ఆయ‌న డైర‌క్ష‌న్ అమ్యెచుర్‌గా ఉంద‌న్నారు కానీ నిజానికి ఈ ద‌ర్శ‌కుడిది అమ్యెచుర్ మెంటాలిటీ ఆయ‌న ట్వీట్స్‌ని బ‌ట్టి అర్థ‌మైంది. త‌న సినిమా ఇదంటూ..త‌లాతోకా లేని అసంబద్ద‌మైన వివ‌ర‌ణ ఇచ్చాడు. క్రిటిక్స్‌ని ఎఫ్ వ‌ర్డ్‌తో తిట్టాడు.

దాంతో ఈ సినిమాలో న‌టించిన శ్రీవిష్ణు అర్జెంట్‌గా స్పందించాడు. ప్ర‌తి క్రిటిక్ అభిప్రాయాన్ని గౌర‌విస్తానని ట్వీట్ చేశాడు. ప్ర‌తి రివ్యూ స‌మంజ‌స‌మైన‌దే, మ‌రో సినిమాతో మిమ్మ‌ల్ని మెప్పిస్తాన‌ని శ్రీవిష్ణు స్పందించాడు.