శ్రీనువైట్ల ఢీ టూ!

Sreenu Vaitla and Vishnu Team up for Dhee 2?
Wednesday, February 20, 2019 - 16:30

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులిస్తున్న శ్రీనువైట్లను ప్రోత్సహించే స్థితిలో ప్రస్తుతం ఏ హీరో లేడు. కనీసం అతడు చెప్పే స్టోరీలైన్ వినడానికి కూడా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. "అమర్ అక్బర్ ఆంటోనీ" ఫ్లాప్ తర్వాత ఈ దర్శకుడి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇలాంటి టైమ్ లో వైట్లతో ఓ హిట్ కాంబో సెట్ అయినట్టు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అవును.. మంచు విష్ణు, శ్రీనువైట్ల హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోందట. గతంలో వీళ్లిద్దరూ కలిసి "ఢీ" అనే హిట్ మూవీ చేశారు. ఆ మేజిక్ ను మరోసారి రిపీట్ చేయబోతున్నారట వీళ్లిద్దరూ. నిజానికి "ఢీ" తర్వాత శ్రీనువైట్లతో మరోసారి సినిమా చేద్దామని విష్ణు చాలా ప్రయత్నించాడు. ఈ మేరకు మోహన్ బాబు కూడా ప్రయత్నించారు. కానీ వైట్ల మాత్రం మంచుహీరో వైపు మళ్లీ చూడలేదు. వరుసగా ఫ్లాపులు రావడంతో మళ్లీ ఇన్నేళ్లకు శ్రీనువైట్లకు మంచు విష్ణు గుర్తొచ్చినట్టున్నాడు.

ఏదైతేనేం ప్రస్తుతం వినిపిస్తున్న పుకార్ల ప్రకారం శ్రీనువైట్లకు ఓ హీరో అయితే దొరికాడు. ఇక నిర్మాత దొరకడమే ఆలస్యం.