రియల్ లైఫ్ రోల్లోశ్రీరెడ్డి

Sri Reddy in climax
Sunday, November 10, 2019 - 14:45

 శ్రీరెడ్డి కి ఫైనల్ గా ఒక రోల్ దక్కింది. అది కూడా ఆల్మోస్ట్ రియల్ లైఫ్ రోలే. 

 భ‌వానీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా రూపొందుతోన్న చిత్రం "క్లైమాక్స్". శ్రీ రెడ్డి ఇందు లో కీలక రోల్ లో కనిపించనుంది.  డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

"వివాదాస్పద న‌టిగా ఈ చిత్రంలో న‌టించాను. క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో సాగే సినిమా ఇది. నా కేర‌క్ట‌ర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నా కేరక్ట‌ర్ చుట్టూ క‌థ చాలా మ‌లుపులు తీసుకుంటుంది. నేను ప‌లికే ప్ర‌తి డైలాగూ, నేను క‌నిపించే ప్ర‌తి సీనూ చాలా చాలా బావుంటాయి,`` అని అన్నారు శ్రీరెడ్డి