మరో బాంబ్ పేల్చిన శ్రీరెడ్డి

Sri Reddy starts production
Thursday, December 26, 2019 - 22:30

షాకుల మీద షాకులు ఇవ్వడం, సంచలన ఆరోపణలు చేయడం శ్రీరెడ్డికి కొత్తకాదు. కాకపోతే ఇది కాస్టింగ్ కౌచ్ బాంబ్ కాదు. అంతకుమించి. అవును.. త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెడతానంటోంది శ్రీరెడ్డి. తన నిర్మాణ సంస్థకు శ్రీరెడ్డి ప్రొడక్షన్స్ అనే పేరు పెడతానని కూడా ప్రకటించింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది.

తన నిర్మాణ సంస్థలో ఎక్కువగా తమిళ టాలెంట్ కే అవకాశం ఇస్తుందట శ్రీరెడ్డి. దీనికి ఆమె చెప్పిన కారణం కూడా కాస్త సహేతుకంగానే ఉంది. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సంచలనం సృష్టించిన సమయంలో టాలీవుడ్ తనను ఆదరించలేదని, అవకాశాల కోసం ఎంతలా ప్రయత్నించినా తనకు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదని ఆరోపిస్తోంది శ్రీరెడ్డి. అదే టైమ్ లో తమిళ ఇండస్ట్రీ తనను ఆదుకుందని, పిలిచి మరీ తమిళ మేకర్స్ కొందరు తనకు అవకాశం ఇచ్చారని చెబుతోంది.

కోలీవుడ్ రుణం తీర్చుకోవాలంటే తనకు ఇంతకుమించి మరో మార్గం కనిపించలేదని, అందుకే తన నిర్మాణ సంస్థలో ఎక్కువ మంది తమిళవాళ్లకే అవకాశం ఇస్తానని ప్రకటించింది శ్రీరెడ్డి. కేవలం ఈ రెండు విషయాలే చెప్పి ముగించింది శ్రీరెడ్డి. సినిమా ఏంటి, హీరో ఎవరు, ఎప్పట్నుంచి మొదలుపెడుతుంది లాంటి విషయాల్ని ఇంకా బయటపెట్టలేదు.