బెడ్రూమ్ వదిలి కిచెన్ వైపు

Sri Reddy turns Youtube Chef during lockdown
Monday, April 27, 2020 - 10:15

వివాదాలతో పేరు తెచ్చుకున్న శ్రీ రెడ్డి ఇప్పుడు బెడ్ రూమ్ వదిలి కిచెన్ వైపు వచ్చింది. ఒకప్పుడు మాట ఎత్తితే సెక్స్ గురించే మాట్లాడేది. రోజూ హాట్ హాట్ ఫోటులు, డబులు మీనింగ్ మాటలతో సోషల్ మీడియాకి కిరాక్ తెచ్చింది. ఆ తర్వాత మోతాదు మించడంతో చిరాకు తెప్పించింది. ఇప్పుడు శ్రీ రెడ్డికి మునుపటి వేల్యూ లేదు.

ఐతే కాంట్రవర్సీల వల్ల వచ్చిన పాపులారిటీ కారణమో మరేదో కానీ దాన్నీ ఆమె ఇప్పుడు యూట్యూబ్ ఆదాయంగా మలుచుకుంటోంది. ఈ లక్డౌన్ పీరియడ్ లో అందరూ యూట్యూబ్ లో వంటకాల రెసిపీలను చూస్తున్నారు. వాటికి బాగా డిమాండ్ ఉంది. అందుకే, ఆమె కూడా ఈ టైంలో వంటకాల వీడియోలను అప్లోడ్ చేస్తోంది.

మా గోదారోళ్ల వంటలు అంటూ ఎండుచేపల కర్రీ అంటూ రకరకాల రెసిపీలను షేర్ చేస్తోంది. తనే స్వయంగా వంట చేస్తోంది. కొన్నాళ్ళు శ్రీ రెడ్డి బెడ్ రూమ్ వైపు చూపు వెయ్యదన్నమాట.