చంద్ర‌బాబుగా మారిన వైఎస్సార్‌

Sritej as CBN in Lakshmis NTR
Friday, January 11, 2019 - 20:15

ఒక సినిమాలో దేవినేని నెహ్రు. మ‌రో సినిమాలో వైఎస్సార్‌. ఇపుడు చంద్ర‌బాబు నాయుడు. ఒకే న‌టుడు..ఇలా ముగ్గురు రాజ‌కీయ నేత‌ల పాత్ర‌ల్లో. శ్రీతేజ్ అనే యువ న‌టుడు ఇపుడు రాంగోపాల్ వ‌ర్మ తీస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్ర‌బాబునాయుడు పాత్ర పోషించ‌నున్నాడు. ఈ ఫోటోల‌ను వ‌ర్మ విడుద‌ల చేశాడు.

ఈ న‌టుడు ఇంత‌కుముందు వ‌ర్మ తీసిన వంగ‌వీటి సినిమాలో దేవినేని నెహ్రూగా న‌టించాడు. అలాగే తాజాగా క్రిష్ తీసిన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రంలో డాక్ట‌ర్ వైఎస్సార్‌గా క‌నిపించాడు. మూడు పాత్ర‌ల్లోనూ ఆయా వ్యక్తుల పోలీక‌ల‌ను రాబ‌ట్ట‌డం నిజంగానే విశేషమే.

వ‌ర్మ తీస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌ని క‌న్న‌డ న‌టి య‌జ్న షెట్టి న‌టిస్తోంది. వ‌ర్మ తీస్తున్న ఈ బ‌యోపిక్‌పై ఇపుడు అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. ఎందుకంటే వ‌ర్మ నిజాల, అబ‌ద్దాల బ‌ట్ట‌లిప్పుతాన‌ని ప్ర‌క‌టించాడు.