మహేష్ కోసం తొక్కిసలాట

Stamped at Mahesh Babu's photo shoot
Wednesday, December 25, 2019 - 22:30

నిజంగానే మహేష్ కోసం తొక్కిసలాట జరిగింది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. ఈరోజు మహేష్ కోసం వేలాది మంది ఫ్యాన్స్ ఎగబడ్డారు. వాళ్లను కంట్రోల్ చేయడం యూనిట్ వల్ల కాలేదు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. దీంట్లో ఇద్దరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు.

సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల మధ్య గట్టిపోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరికీ ఇద్దరూ ప్రచారంతో ఊదరగొడుతున్నారు. బన్నీ సినిమా సాంగ్స్ కు పోటీ ఇవ్వడం మహేష్ వల్ల కావడం లేదు. అందుకే కాస్త డిఫరెంట్ గా ప్రచారం చేయాలనుకున్నారు. అభిమానులతో ఫొటో షూట్ నిర్వహించి ప్రమోషన్ ఇవ్వాలనుకున్నారు. అది కాస్తా వికటించింది.

సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు స్పందించి వేలాది మంది ఫ్యాన్స్ అల్యూమినియం ఫ్యాక్టరీకి దూసుకొచ్చారు. అయితే పోలీసుల సహకారం తీసుకోకపోవడంతో ప్రమాదం జరిగింది. పోలీసులకు ఆలస్యంగా సమాచారం అందింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ గొడవ వల్ల జరగాల్సిన ఫొటోషూట్ కాస్తా రద్దయింది.