ఇదే ఆకుచాటు పిందె త‌డిసే సాంగ్‌

Still: Akuchatu Pinde Tadise song on Balayya and Rakul
Wednesday, October 10, 2018 - 16:45

వానపాట‌ల్లో "ఆకుచాటు పిందె త‌డిసే" పాట ఎంతో పాపుల‌ర్‌. "వేట‌గాడు" సినిమా కోసం ఎన్టీఆర్‌, శ్రీదేవిల‌పై ద‌ర్శ‌క‌ర‌త్న కె.రాఘ‌వేంద్ర‌రావు చిత్రీక‌క‌రించిన ఈ పాట‌ని ఇపుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌ళ్లీ చూడ‌బోతున్నాం. 1979లో వేట‌గాడు విడుద‌లైంది. అంటే దాదాపు 39 ఏళ్ల త‌ర్వాత అదే పాట‌ని మ‌నం కొత్త‌గా చూడ‌బోతున్నాం.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్‌గా ఆయ‌న కుమారుడు బాల‌య్య‌,శ్రీదేవిగా ర‌కుల్ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ పాట‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ హైద‌రాబాద్‌లో చిత్రీక‌రిస్తున్నారు. పాట స్టిల్‌ని తాజాగా విడుద‌ల చేశారు. బాల‌య్య‌, ర‌కుల్‌పై తీస్తున్న ఈ వాన పాట సినిమాకి హైలెట్ కానుంద‌ట‌.