అబ‌ద్దాలు ఆడిన అతికిన‌ట్లుండాలిగా!

Strange explanation behind DSP's walkout from Valmiki
Monday, May 20, 2019 - 19:00

వ‌రుణ్ తేజ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ తీస్తున్న వాల్మీకీ సినిమా నుంచి దేవీశ్రీప్ర‌సాద్ త‌ప్పుకున్నాడు. ఎందుకు త‌ప్పుకున్నాడనేది ప‌క్క‌న పెడుదాం, ఇలాంటివి క్వ‌యిట్ కామ‌న్‌. దాదాపుగా చాలా సినిమాల విష‌యంలో ఇది జ‌రుగుతుంటుంది. ఐతే ఇపుడు దానికి కార‌ణం ఇదేనంట‌గా అంటూ ఫీల‌ర్లు వ‌దులుతున్నారు. వార్త‌లు వండుతున్నారు. ఈ వంట‌కంతోనే తంటా.

హ‌రీష్ శంక‌ర్ ఒక రీమీక్స్ పాట చేయ‌మ‌ని అడిగాడ‌ట‌, తాను రీమీక్స్‌ల‌కి దూరమ‌ని దేవీశ్రీ అన్నాడ‌ట‌. అందుకే దేవీ వాకౌట‌య్యాడ‌ట‌. దీనికే అంద‌రూ ర‌క‌ర‌కాలుగా వార్తలు పుటిస్తున్నారే అంటూ ఒక క్వ‌శ్చ‌న్ తామే వేసుకొని..తామే స‌మ‌ధానం ఇస్తున్నారు. 

రీమీక్స్ పాట చేయ‌న‌ని త‌ప్పుకోవ‌డమ‌నేది మ‌రి సిల్లీగా లేదు. ఆ పాట కావాలంటే మ‌రో సంగీత ద‌ర్శ‌కుడితో చేయించుకోవ‌చ్చు క‌దా. ఒక పాట మ‌రో మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌తో చేయించుకోవ‌డమ‌నేది చాలా సినిమాల్లో చూశాం క‌దా. ఇంత చిన్న విష‌యానికే వాకౌట్ అవుతారా?

అబ‌ద్దం ఆడిన అతికిన‌ట్లు ఉండాలి క‌దా! ఇంత‌కీ లీక్ చేసిన‌వాళ్లు అబ‌ద్దం ఆడుతున్నారు. లీక్‌ని గీకినోళ్ల క‌వ‌రింగా? హ‌రీష్‌శంక‌ర్‌, దేవీశ్రీ ప్ర‌సాద్ మాత్రం ఈ విష‌యంలో సైలెంట్‌గా ఉన్నారు. ఇది రోటీన్ మేట‌ర్ అన్న‌ట్లు వారు దానిపై స్పందించ‌డం లేదు.