సుజీత్ సూచనోపాఖ్యానం

Sujeeth says he didn't copy Largo Winch
Friday, September 6, 2019 - 23:00

దర్శకుడు సుజీత్ ...లార్గో వించ్ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ అస్సలు చూడలేదట. నమ్మండి బాబూ. అదుగో అదే మరి ... 350 కోట్లు పెట్టి సినిమా తీసిన దర్శకుడు చెప్తుంటే ...మీరు ఆలా బ్రహ్మి ఎక్సప్రెషన్ ఇస్తే ఎలా? 

అతడు సినిమా క్లైమాక్స్లో సునీల్ డైలాగులు గుర్తొస్తున్నాయి....సుజీత్ చెప్తున్న ఉపాఖ్యానం చూస్తూంటుంటే. "మీరు లార్గో వించ్ చూడలేదు.. ఒక్క సీన్ కూడా కాపీ కొట్టలేదు. మరి సినిమా నిండా ఫ్రెంచ్ సినిమా సీన్లే ఎలా కనిపించాయండి?," అని సునీల్ నాజర్ తాతని అడిగినట్లు మనం సుజీత్ ని అడగాలి. 

అతని ఇచ్చిన సందేశాల్లో మరికొన్ని.. 

సాహోలో ఏదైనా అర్థంకాకపోతే మరోసారి చూడాలంట
.
క్రిటిక్స్ కాస్త సంయమనం పాటించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. రివ్యూలు పోస్ట్ చేసే ముందు ఇంకాస్త వేచి చూస్తే బాగుండేదని, ఆక్యుపెన్సీని అది ప్రభావితం చేస్తుందని అంగీకరించాడు. 

బీహార్ నుంచి తనకు చాలామంది కాల్స్ చేస్తున్నారని తెలిపాడు. అంతేకాదు.. బీహార్ లో పుట్టి ఉంటే సాహో సినిమా తీసినందుకు సుజీత్ కు వాళ్లు గుడికట్టి ఉండేవారట..