సుకుమార్ రైటింగ్స్ సుకుమార్ ప్రొడ‌క్ష‌న్స్‌!

Sukumar to producer many films on Sukumar Writings banner
Wednesday, September 5, 2018 - 19:30

ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మాత అవ‌తారం ఎత్తి "కుమారి 21 ఎఫ్" అనే చిన్న చిత్రాన్ని నిర్మించాడు. అది సూప‌ర్‌హిట్ అయింది. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు అనే మ‌రో మూవీ కూడా తీశాడు కానీ అది పరాజ‌యం పాలు అయింది. దాంతో ఇక నిర్మాత‌గా సినిమాల‌కి ఫుల్‌స్టాప్ పెడుతార‌నుకున్నారంతా. ఐతే "రంగ‌స్థ‌లం" సినిమాతో ద‌ర్శ‌కుడిగా సుకుమార్ రేంజ్ మారిపోయింది. సుకుమార్ బ్రాండ్ నేమ్ కూడా మ‌రింత‌గా పెరిగింది. దాంతో ఇపుడు ఆయ‌న ప్రొడ‌క్ష‌న్‌ని సీరియ‌స్‌గా తీసుకున్నాడు. ఒక‌టి కాదు రెండు కాదు వ‌రుస‌గా మూడు, నాలుగు సినిమాల‌ను త‌న బ్యాన‌ర్‌పై నిర్మించ‌నున్నాడు.

త‌న ద‌గ్గ‌ర వ‌ర్క్ చేస్తున్న అసిస్టెంట్‌ల‌ను, రైట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ సినిమాలు నిర్మించ‌నున్నాడు. అందులో మొద‌ట‌గా సాయి ధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణవ్ తేజ్‌ని ఇంట్ర‌డ్యూస్ చేస్తూ ఒక మూవీ నిర్మిస్తున్నాడు. మైత్రీ మూవీస్ భాగస్వామ్యంతో నిర్మించే ఈ సినిమా ద్వారా రంగ‌స్థ‌లంకి ప‌నిచేసిన బుచ్చిబాబుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాడు.

అలాగే కాశి అనే మ‌రో అసిస్టెంట్‌తో ఇంకో సినిమా కూడా నిర్మాణం మొద‌లుపెడుతున్నాడు. ఈ కొత్త ప్రొడ‌క్ష‌న్ల అనౌన్స్‌మెంట్స్ ఒక్కొక్క‌టిగా వ‌స్తాయి త్వ‌ర‌లో.