ఈ సండే స్టఫ్ మీకు ఇదే!

Sunday releases on Netflix and Amazon Prime
Sunday, April 26, 2020 - 10:00

శుక్రవారం వచ్చిందంటే కొత్త రిలీజ్ ల కోసం ఎదురుచూసేవాళ్లు. కానీ ఈ లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీ రిలీజ్ ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే ఓటీటీలన్నీ ఫ్రెష్ కంటెంట్ తో రెడీ అయిపోతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే భీష్మ లాంటి సూపర్ హిట్ సినిమా, క్రిస్ ఎహ్మ్ వర్త్  నటించిన "ఎక్సట్రాక్షన్" ఓటీటీలోకి వచ్చేయగా... ఈరోజు సండే స్పెషల్ గా మరింత ఫ్రెష్ కంటెంట్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయింది.

ఈరోజు నెట్ ఫ్లిక్స్ లో రెండు ఒరిజిటల్ కంటెంట్స్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో ఒకటి కరోనా వైరస్ ఎక్స్ ప్లెయిన్డ్. ఇదొక ఇంగ్లిష్ డాక్యుమెంటరీ. ఈ టైమ్ లో చూడాల్సిన స్టఫ్ అంటోంది నెట్ ఫ్లిక్స్. దీంతో పాటు తమ ఫ్లాట్ ఫామ్ లో సూపర్ హిట్టయిన ది లాస్ట్ కింగ్ డమ్ సిరీస్ కు సంబంధించి నాలుగో సీజన్ ను స్ట్రీమింగ్ కు పెట్టింది.

అటు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఇవాళ్టి నుంచి లిటిల్ ఉమెన్ అనే హాలీవుడ్ సినిమా అందుబాటులోకి వచ్చింది. మెరీల్ స్ట్రీప్ నటించిన ఈ సినిమా 6 విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ అయి, ఒక అవార్డ్ కూడా అందుకుంది. అంతేకాదు.. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది ఈ పీరియడ్ మూవీ.

ఈ ఒరిజినల్ కంటెంట్, ఫీచర్ ఫిలిమ్స్ తో ఈ క్వారంటైన్ సండే ను హ్యాపీగా గడిపేయండి.