షూటింగ్ లోకేష‌న్‌లో సందీప్ కిష‌న్‌కి గాయాలు

Sundeep Kishan gets injured
Saturday, June 15, 2019 - 20:30

టాలీవుడ్‌కి చెందిన మ‌రో హీరో గాయ‌ప‌డ్డాడు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, నాని, నాగ‌శౌర్య‌....ఇలా ప‌లువురు స్టార్స్ రీసెంట్‌గా షూటింగ్ సీన్లో గాయ‌ప‌డ్డారు. శనివారం యువ హీరో సందీప్ కిష‌న్‌కి గాయాలు అయ్యాయి.

సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'తెనాలి రామకృష్ణ'. కర్నూలులో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఫైట్ మాస్టర్ చేసిన తప్పిదం వల్ల హీరోకి గాయాలు అయ్యాయి. ఫైట్‌లో భాగంగా బాంబ్ బ్లాస్ట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ తప్పిదంతో సందీప్ కిషన్ ఛాతీ, కుడి చేతిపై గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే కర్నూలు మై క్యూర్‌ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ప్రాధమిక చికిత్స అందించారు.  

సందీప్ కిష‌న్ షూటింగ్‌ని ర‌ద్దు చేసుకొని హైద‌రాబాద్ వ‌స్తున్నాడు. హైద‌రాబాద్‌లో మెరుగైన చికిత్స తీసుకోనున్నాడు.