అమ్మాయి దొరకడం లేదంట

Sundeep Kishan says he's waiting for right girl
Thursday, April 23, 2020 - 16:30

టాలీవుడ్ లో పెళ్లి కాని ప్రసాదుల జాబితాలో సందీప్ కిషన్ కూడా ఉన్నాడు. చాన్నాళ్లుగా అతడి పెళ్లిపై పుకార్లు చెలరేగుతున్నప్పటికీ ఏదీ నిజం కాలేదు. తన పెళ్లిపై స్వయంగా సందీప్ కిషన్ స్పందించాడు. పెళ్లి చేసుకోవాలని తనకు కూడా ఉందని, కానీ అమ్మాయిలు దొరకడం లేదని అంటున్నాడు. సామాన్య జనాలకు అమ్మాయిలు దొరకడం లేదంటే అర్థంచేసుకోవచ్చు...  సందీప్ కిషన్ లాంటి హీరోకు కూడా పెళ్లి చేసుకోవడానికి ఓ అమ్మాయి దొరకడం లేదంటే కాస్త ఆశ్చర్యపోవాల్సిన విషయమే.

లాక్ డౌన్ టైమ్ లో ఓ వెబ్ ఛానెల్ తో మాట్లాడిన సందీప్ కిషన్.. తను పెళ్లికి రెడీ అని ప్రకటించాడు. ఇంకా చెప్పాలంటే.. రెండేళ్ల నుంచి పెళ్లికి సంబంధించి సీరియస్ గా ఆలోచిస్తున్నానని, కానీ పిల్ల దొరకడం లేదంటున్నాడు. మంచి అమ్మాయి దొరికినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానంటున్నాడు.

ఇక లవ్ ఎఫైర్ల గురించి మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లో ప్రతి ఏడాది తనకు ఓ క్రష్ ఉండేదంటున్నాడు సందీప్ కిషన్. విశాఖపట్నంలోని విజ్ఞాన్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు ఓ అమ్మాయిని బాగా ఇష్టపడ్డానని... అది కాస్తా బయటకొచ్చి కాలేజ్ లో చాలా పెద్ద ఇష్యూ అవ్వడంతో అక్కడ్నుంచి వేరే కాలేజ్ కు వెళ్లిపోయానంటున్నాడు. తనకు బాగా గుర్తున్న లవ్ స్టోరీలో అదొకటని చెప్పుకొచ్చాడు సందీప్. ఇప్పుడా అమ్మాయి పేరును బయటపెట్టలేనని, ఆమెకు పెళ్లయిపోయి, పిల్లలు కూడా ఉన్నారని చెప్పుకొచ్చాడు.

ఇక హీరోయిన్లతో ఎఫైర్ల పై స్పందిస్తూ.. హీరోయిన్లతో లింక్ పెడుతూ చాలా గాసిప్స్ వస్తుంటాయని అలాంటివి తను పట్టించుకోనని చెబుతున్నాడు. రెజీనా, హన్సిక, రకుల్ తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నాడు.