కేఏ పాల్ బయోపిక్ లో ట్రంప్ ?

Sunil getting ready for K A Paul bipoic?
Wednesday, July 10, 2019 - 18:30

ప్ర‌ముఖ ఇవాంజెలిస్ట్‌ కె.ఏ పాల్ బ‌యోపిక్ తీయ‌బోతున్నారు అని చాలా కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. కేఏ పాల్‌గా సునీల్ న‌టించ‌బోతున్నాడ‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌య‌మై సునీల్ ఇంత‌వ‌ర‌కు నోరు విప్ప‌లేదు. ఐతే, ఈ సినిమా కోస‌మే సునీల్ తాజాగా అమెరికా వెళ్లాడ‌ట‌. పాల్‌కి త‌గ్గ మేక‌ప్‌ని క్రియేట్ చేసుకునేందుకు అమెరికా వెళ్లిన‌ట్లు టాక్‌. మ‌రోవైపు,  ఆ సినిమా లో ట్రంప్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యకుడు ట్రంప్ లాగే  పోలికలు వుండే ఆర్టిస్ట్ ని గుర్తించింద‌ట టీమ్‌.

ఈ సినిమా లో నార్త్ కొరియా అధ్యకుడు కిమ్ , హాలీవుడ్ స్టార్ నటి  ఏంజెలీనా జోలీ  పోలిక‌లుండే ఆర్టిస్ట్‌లు  కూడ నటిస్తున్నట్టు టాక్‌. 

ఇంత‌కీ ఇదంతా నిజ‌మేనా లేక ప‌బ్లిసిటీ కోసం చేస్తున్న క్యాంపెయినా?