మళ్లీ పెళ్లి మాట ఎత్తట్లేదు కదా

Sunitha cancels wedding plans
Thursday, September 26, 2019 - 15:45

తెలుగులో చాలా అందమైన గాయని...సునీత. ఆమె గాత్రానికి ఫ్యాన్స్‌ ఉన్నట్లే. ఆమె బ్యూటీకీ కూడా ఫాలోవర్స్‌ ఉన్నారు. అందుకే, ఈ అందమైన గాయని తరుచుగా గాసిప్‌ కాలమ్‌లలోకి వస్తుంటుంది.  భర్త నుంచి విడిపోయి చాలా కాలమైంది. ఆమె కూతురు, కొడుకు ఇద్దరూ పెద్దోళ్లు అయిపోయారు. కూతురు ఆల్రెడీ సింగర్‌గా మారగా, కొడుకు ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్నాడు. ఐతే ఆమె ఏజ్‌ మాత్రం తక్కువే. ఇంకా 40ల్లోనే ఉంది. అందుకే ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

కొన్నేళ్ల క్రితం ఒక పొలిటిషియన్‌తో రెండో పెళ్లి అని పుకారు షికారు చేసింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో.. ఒక వ్యాపారవేత్తతో పెళ్లి ఫిక్స్‌ అయిందని, ఆమె పిల్లలు ఇద్దరూ ఒప్పుకున్నారనే బ్రేకింగ్‌ న్యూస్‌ బ్రేక్‌ అయింది. ఆర్నెళ్లు గడిచాయి. మళ్లీ ఆ ఊసే లేదు. ఇపుడు ఆమె పాటల షోలతో, టీవీ షోలతో ఫేస్‌బుక్‌ నిండా అప్‌డేట్స్‌ చేసుకుంటోంది. ఎక్కడా పెళ్లి ప్రస్తావనే లేదు. అంటే ఇది కూడా పుకారుగానే మిగిలిందన్నమాట.

సినిమాల్లో పాటలు పాడే ఆఫర్లు సునీతకిపుడు తగ్గాయి. ఐతే టీవీ షోలతో మాత్రం ఆమె బిజీగా ఉంది.