స‌న్నీలియోన్‌తో చిందులేసిన మ‌మ్మూట్టి

Sunny Leonehooting for Madhura Raja item number
Monday, January 28, 2019 - 22:30

త్వ‌ర‌లోనే "యాత్ర" సినిమా విడుద‌ల కానుంది. మ‌మ్మూట్టి వైఎఎస్సార్‌గా న‌టించిన సినిమా యాత్ర. ఈ సినిమా షూటింగ్‌ని మ‌మ్మూట్టి ఎపుడో పూర్తి చేశారు. దాంతో ఆయ‌న త‌న పంథాలో త‌న మ‌ల‌యాళ సినిమాలు చేసుకుంటున్నారు. 67 ఏళ్ల మ‌మ్మూట్టి ఇప్ప‌టికీ చాలా బ‌లిష్టింగా క‌నిపిస్తారు. ఆయ‌న ఓ ప‌దేళ్లు యంగ్‌గా ఉంటారు. 40 ఏళ్ల వాడి ఎన‌ర్జీని చూపుతారు. ఇపుడు ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే ఆయ‌న సెక్సీ భామ స‌న్నీ లియోన్‌తో డ్యాన్స్ చేస్తున్నాడు. స‌న్నీతో అలా చేయాలంటే ఎంత ఎన‌ర్జీ ఉండాలి మ‌రి.

మమ్మూట్టి త‌న "పోకిరి రాజా" సినిమాకి సీక్వెల్‌గా "మ‌ధుర‌రాజా" అనే సినిమాని తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఇందులో ఐటెంసాంగ్‌లో స‌న్నీలియోన్ న‌టిస్తోంది. ఆ మ‌ధ్య స‌న్నీ లియోన్‌..కోచ్చికి ఒక న‌గ‌ల షాప్ ప్రారంభోత్స‌వానికి వెళ్లింది. ఆమెని చూసేందుకు మ‌ల‌యాళీలు మూడు కిలోమీట‌ర్లు బారులు తీరారు. ష‌కీలాని నెత్తిన పెట్టుకున్న ఆ మ‌ల‌బారు తీరంలో స‌న్నీలియోన్‌కి మామూలు క్రేజ్ లేదు. అందుకే ఆమె క్రేజ్‌ని ఉప‌యోగించుకునేందుకు ఇందులో ఐటెంసాంగ్ చేయిస్తున్నారు.