సురేఖవాణి సైలెంటయింది

Surekha Vaani getting no offers?
Thursday, September 26, 2019 - 15:45

ఒకపుడు ప్రతి సినిమాలోనూ కనిపించేంది సురేఖావాణి. అందమైన ఫేస్‌, ఫిగర్‌తో వదిన, ఆంటీ పాత్రల్లో దర్శనమిచ్చేది. చాలా మంది యువ దర్శకులు ఆమెని ఆ పాత్రల్లో తీసుకునేందుకు ఎక్కువ ఉత్సాహం చూపేవారు. ఐతే ఇపుడు ఆమె జోరు తగ్గింది. సురేఖావాణికిపుడు ఆఫర్లు తగ్గినట్లు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఆమె భర్త చనిపోయాడు. ఆమె భర్త నుంచి విడిపోయి చాలా కాలమే అవుతోంది. ఐనా భర్త చనిపోవడం బాధే కదా. ఆ శాడ్‌నెస్‌ వల్లే ఆమె సినిమాలకి దూరం ఉంటుందా? లేక ఆమెకి అవకాశాలు డ్రై అయ్యాయా అనేది తెలియదు.

కానీ మొత్తమ్మీద ఈ నటి వెండితెరపై ఇటీవల మరీ నల్లపూస అయిందనేది వాస్తవం. మరోవైపు, ఆమె కూతురు కూడా త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందనే ప్రచారం మాత్రం జరుగుతోంది.