నా లైఫ్ నా ఇష్టం... సురేఖ

Surekha Vani's strong reply to trolls
Thursday, March 19, 2020 - 16:45

సురేఖ వాణికి కోపం వచ్చింది. తనని ట్రోల్ చేస్తున్నవారిపై రివర్స్ లో గట్టిగా దాడి చేసింది. 40 ప్లస్ లోనూ మంచి బాడీని మెయింటైన్ చేసే నటి... సురేఖ వాణి. ఆమె లైఫ్ స్టైల్ చాలా  బోల్డ్ గా ఉంటుంది. అందుకే ఆమెకి సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉంది. ఐతే, "కూతురిని ఎలా పెంచకూడదో తెలుసుకోవాలంటే సురేఖ వాణి ఇన్ స్టాగ్రామ్ చూస్తే సరిపోతుంది," అని కొందరు ట్రోల్ చేశారు. 

ఈ ట్రోలింగ్ శృతి మించి చేస్తుండడంతో తట్టుకోలేక పోయింది. కొందరికి ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. నా లైఫ్ నా ఇష్టం.. అని తేల్చి చెప్పింది. 

సురేఖ వాణి కూతురు కూడా మేజర్. ఆమె కూడా తల్లితో కలిసి మంచి పోజులు ఇస్తుంటుంది. బహుశా ఈ అమ్మాయి కూడా గ్లామర్ ఫీల్డ్ లోకి దిగుతుందేమో.