సూర్య ఆమెకి ఫిదా అయ్యాడా?

Suriya fida over fidaa beauty
Wednesday, May 1, 2019 - 18:45

త‌మిళ సూప‌ర్‌స్టార్ సూర్య‌కి జెంటిల్‌మేన్ అనే పేరుంది. త‌న‌తో వ‌ర్క్ చేసిన హీరోయిన్ల‌ని ఎక్కువ‌గా పొగడ‌డు. ఎందుకంటే అది ఎలాంటి రూమ‌ర్ల‌కి దారితీస్తుందో అని. అలా ఉంటుంది సూర్య వ్య‌వ‌హార‌శైలి.

ఐతే తొలిసారిగా ఒక హీరోయిన్ గురించి ప‌బ్లిక్ స్టేజ్‌పై తెగ పొగిడాడు. ఆ భామ ఎవ‌రో కాదు.. ఫిదా సుంద‌రి సాయి ప‌ల్ల‌వి. ఆమె న‌ట‌న‌కి సూర్య ఫిదా అయిపోయాడ‌ట‌. వీరిద్ద‌రూ క‌లిసి ఎన్‌.జీ.కే అనే సినిమాలో న‌టించారు. ఇటీవ‌లే ఈ సినిమా ట్ర‌యిల‌ర్‌, ఆడియో త‌మిళ‌నాట విడుద‌లైంది. ఆ ఈవెంట్‌లో సాయి ప‌ల్ల‌వి గురించి చాలా సేపు మాట్లాడాడు సూర్య‌. ఆమె న‌ట‌న అత్యంత నేచుర‌ల్‌గా ఉంద‌ని, అస్స‌లు న‌టిస్తున్న‌ట్లు ఎపుడూ అనిపించలేద‌ని చెప్పాడు ఎన్‌జీకే. 

సాయి ప‌ల్ల‌వి సూర్య‌కి వీరాభిమాని. సూర్య‌తో న‌టించాలన్న ఆమె క‌ల నెర‌వేరింది. ఐతే తన అభిమాన హీరో త‌న న‌ట‌న గురించి పొగిడుతుంటే ఆమె ఆనందానికి హ‌ద్దులేదిక‌.