జ‌గ‌న్ క‌ష్టానికి ద‌క్కిన రిజ‌ల్ట్‌: సూర్య‌

Suriya praises YS Jagan
Wednesday, May 29, 2019 (All day)

ఆంధ్ర‌ప్రదేశ్ కొత్త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అందుకున్న విజ‌యం అపురూప‌మైన‌ది అంటున్నారు హీరో సూర్య‌. గ‌జిని ఫేమ్ సూర్య‌...జ‌గ‌న్‌కి క్లోజ్‌ఫ్రెండ్‌. జ‌గ‌న్ వ్యాపారాల‌కి చెందిన ఒక బ్రాండ్‌కి సూర్య అంబాసిడ‌ర్‌. ఇద్ద‌రి మ‌ధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. ఇపుడు జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతో సూర్య ఆనందంగా ఉన్నాడు.

ఆయ‌న క‌ష్టానికి, ఓర్పుకి ద‌క్కిన రిజ‌ల్ట్ ఇది అని సూర్య ప్ర‌శంసలు కురిపించారు.

"ఇది అపురూప విజ‌య‌మే. కానీ దాని వెనకాల చాలా క‌ఠోర శ్ర‌మ‌, అంకుఠిత దీక్ష ఉంది. పదేళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. విజ‌యంతో పాటు స‌వాళ్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా జ‌యించి మ‌రింత ఉన్న‌త శిఖ‌రాల‌కి వెళ్లాల‌ని కోరుకుంటున్నా," అని అన్నారు సూర్య‌. సూర్య న‌టించిన "ఎన్‌జీకే" చిత్రం ఈ నెల 31న విడుద‌ల కానుంది. ఇది పొలిటిక‌ల్ థ్రిల్ల‌రే. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చాడు ఈ నంద గోపాల‌కృష్ణ (ఎన్‌జీకే).