సూర్య మార్కెట్ దారుణంగా డ్రాప్ అయింది

Surya's market wiping out in Telugu states
Monday, June 3, 2019 - 09:45

సూర్య న‌టించిన సినిమాకి మొద‌టి మూడు రోజులు 3 కోట్ల రూపాయ‌ల 30 ల‌క్ష‌లు వ‌చ్చాయి. అంటే అత‌ని మార్కెట్ ఏ రేంజ్‌కి ప‌డిపోయిందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇది "ఎన్‌జీకే" అనే కొత్త సినిమా వ‌సూళ్లు. ఇక ఈ వీక్ డేస్ క‌లెక్ష‌న్లు మ‌రీ వీక్‌గా ఉంటాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సూర్య సినిమాలు 5 నుంచి 7 కోట్ల రూపాయ‌ల‌కి మించి థియేట‌ర్ల నుంచి వ‌సూళ్లు రాబ‌ట్టడం లేదంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.

ఇప్ప‌టికే విక్ర‌మ్ మార్కెట్ తెలుగులో మొత్తంగా తుడుచుకుపెట్టుకుపోయింది. కార్తీ కాస్తా బెట‌ర‌నుకుంటే అత‌ని సినిమాలు కూడా రీసెంట్‌గా ఆడ‌డం లేదు. క‌మ‌ల‌హాస‌న్ సినిమాల‌కి దిక్కు లేదు. సూర్య కూడా వీరి జాబితాలో చేరుతుండ‌డం శాడ్‌.

ఒక్క ర‌జ‌నీకాంత్ సినిమాల‌కి త‌ప్ప తెలుగులో ఇపుడు ఏ త‌మిళ హీరోకి క‌నీస ఓపెనింగ్స్ వ‌చ్చే సీన్ లేదు.