నా కొడుకు ఇచ్చిన కానుక: మెగాస్టార్‌

Sye Raa is best gift I recieved from my son: Chiru
Monday, February 18, 2019 - 13:30

మెగాస్టార్ చిరంజీవి ఈ మ‌ధ్య చాలా ఆనందంగా ఉన్నారు. రీఎంట్రీలో స‌క్సెస్ కావ‌డం ఒక రీజ‌న్‌. త‌న కొడుకు రామ్‌చ‌ర‌న్ పెద్ద హీరోగా పూర్తిస్థాయిలో నిల‌బ‌డ‌డం మ‌రో కార‌ణం. "మ‌గ‌ధీర" త‌ర్వాత ఒక ఎనిమిదేళ్ల పాటు ఆ రేంజ్ హిట్ రాక‌పోవ‌డం, నటుడిగా పేరు రాక‌పోవ‌డంతో కొంత నిరాశ‌లో ఉన్న చ‌ర‌ణ్‌కి.. "ధృవ‌", "రంగ‌స్థ‌లం" సినిమాలు ఫేట్‌ని మార్చేశాయి. ధృవ‌తోనే న‌టుడిగా ఇంప్రెస్ చేశాడు చ‌ర‌ణ్‌. ఇక రంగ‌స్థ‌లంతో న‌టుడిగా, స్టార్‌గా...పూర్తిస్థాయిలో విజృంభించాడు. "విన‌య విధేయ రామ" ఫ్లాప్ అయినా కూడా ఆ రెండు సినిమాల‌తో వ‌చ్చిన విజ‌యాలు, పేరు చాలు. నెక్స్ట్ ఎలాగూ రాజ‌మౌళి మూవీ ఉంది.

అందుకే మెగాస్టార్ సంతోషంగా ఉన్నాడు. "ఖైదీ నెంబ‌ర్ 150" సినిమాతో మెగా రీఎంట్రీ ఇచ్చిన చిరు ఇపుడు సైరా సినిమాలో న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్‌కి వ‌చ్చిన టీవీ9 టీఎస్సార్ అవార్డును చిరు అందుకున్నారు. ఆదివారం వైజాగ్‌లో ఈ అవార్డు ఫంక్ష‌న్‌ని నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవితో పాటు నాగార్జున, బాలకృష్ణ హాజరయ్యారు.

ఈ వేదిక‌పై మాట్లాడిన చిరు త‌న కొడుకు త‌న‌కిచ్చిన గొప్ప బ‌హుమ‌తి సైరా అని అన్నారు.  "నా కెరీర్‌లో 150 సినిమాలు చేశాను కానీ ఇలాంటి పీరియడ్‌ డ్రామాలో నటించే అవకాశం రాలేదు. ఇదే విషయాన్ని చరణ్‌తో చెప్పాను. దాంతో వాడు సైరాని ప‌ట్టాలెక్కించాడు. త‌నే ప్రొడ్యుస్ చేస్తున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి తీయాల‌నుకుంటున్నా ఆ సినిమా కోరిక‌ని వాడు ఇపుడు నెర‌వేర్చాడు. ఇది బెస్ట్ గిఫ్ అని", పుత్రోత్సాహంలో చిరు చెప్పారు.