పెళ్లిపై అంత ఆస‌క్తి లేదు

Taapsee says she is not looking for life partner
Monday, June 10, 2019 - 19:15

తాప్సీ న‌టించిన స‌రికొత్త థ్రిల్ల‌ర్‌.."గేమ్‌ ఓవ‌ర్". తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన తాప్సీ అనేక విష‌యాలు మీడియాతో ముచ్చ‌టించింది. అందులో ఆమె పెళ్లి ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చింది.

పెళ్లి చేసుకోవాల‌న్న ఆస‌క్తి అంత‌గా లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పింది. తాను ఏ పార్ట్‌న‌ర్ కోసం వెత‌కడం లేదంట‌. లైఫ్ పార్ట్‌న‌ర్ కోసం చూడ‌ట్లేదు కానీ ప్రొడ‌క్ష‌న్ పార్ట్‌న‌ర్ కోసం చూస్తున్నాను అంటోంది. ఆమె నిర్మాత‌గా ప‌లు సినిమాలు ప్లాన్ చేస్తోంది. త‌న‌తో క‌లిసి సినిమా నిర్మాణంలో పాలు పంచుకునే పార్ట్‌న‌ర్స్ కోసం వెతుకుతోంద‌ట‌.

తాప్సీ ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ స్పోర్ట్స్‌మేన్‌తో డేటింగ్‌లో ఉంద‌ని ఇంత‌కుముందు ప్ర‌చారం జ‌రిగింది. ఐతే ఈ మ‌ధ్య ఆ పుకార్లు కూడా త‌గ్గాయి. తాప్సీ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకొంది. వైవిధ్య‌మైన సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకొంది.