దేనికైనా రెడీ: ట‌బు

Tabu says she will do any role
Tuesday, May 14, 2019 - 14:45

ఆంటీ పాత్రలే కాదు హీరోయిన్ పాత్రలూ చేస్తానని అంటోంది 40 ప్లస్ సుందరి టబు. టబుగా పాపులరయిన తబుస్సమ్ ...వెర్సటైల్ నటి. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోపించగలదు. ఇటీవల విడుదలైన "అంధధూన్" మూవీలో ఏకంగా లేడీ విలన్ గా నటించింది.

ఇపుడు అజయదేవగన్ కి భార్యగా నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్ సినిమాలో ఆంటీ పాత్రలో దర్శనమివ్వనుంది. ఇంత వైవిధ్యం ఒక్క టబుకే సాధ్యం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తీస్తున్న తాజా చిత్రంలో టబు ఒక కీ పాత్రలో కనిపించనుంది. అది తల్లి పాత్ర. ఐతే ఆమె బన్నికి తల్లిగా నటించనుందా, పూజా హెగ్డకి తల్లిగా అనేది సస్పెన్స్.

ఇప్పటికే షాహిద్ కపూర్ కి పినతల్లిగా నటించింది. ఇలాంటి పాత్రలు చేస్తూనే "దే దే ప్యార్ దే". సినిమాలో అజయ్ దేవగన్ కి భార్య పాత్ర పోషించింది. ఈ సినిమాలో గ్లామరస్ హీరోయిన్గా రకుల్ నటిస్తోంది. ఐతే ఆయన భార్య రోల్ మాత్రం టబుదే.