వీళ్లిద్ద‌రూ మంచి ఫ్రెండ్స‌ట‌!

Tamannah and Shruti are best friends?
Thursday, January 31, 2019 - 20:30

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఒకే ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్లకు పడదు అంటుంటారు. కానీ ఇలాంటి సామెతల్ని కొట్టిపారేస్తున్నారు తమన్న, శృతిహాసన్. వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంట‌. ఎలాంటి భేషజాలు లేకుండా అన్నీ మాట్లాడుకుంటారట‌. టైమ్ దొరికితే కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు మరోసారి తమ మధ్య స్నేహాన్ని చాటుకున్నారు. 

రీసెంట్ గా "ఎఫ్2" సినిమాలో నటించిన తమన్న. ఆ సినిమాను కొంతమంది బాలీవుడ్ ప్రముఖులకు ప్రత్యేకంగా చూపించారు. ఆ ప్రీమియర్ కు శృతిహాసన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది తమన్న. మిల్కీబ్యూటీ ఆహ్వానం మేరకు ముంబయిలో ఆమెతో కలిసి సినిమా చూసింది శృతిహాసన్. అలా మరోసారి ఇద్దరూ కలిసి ఆనందంగా గడిపారు.

త‌మ‌న్న మ‌రో సినిమా ఇంకా సైన్ చేయ‌లేదు. ఆమె ప్ర‌స్తుతం సైరా సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న న‌టిస్తోంది. ఇక శ్రుతి హస‌న్‌కి ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. వీరిద్ద‌రికి చెన్నైలోదోస్తీ కుదిరింద‌ట‌.