16 కోట్లు పెట్టి అపార్ట్‌మెంట్ కొన్న త‌మ‌న్న‌

Tamannah buys apartment in Mumbai for whopping Rs 16 Cr
Monday, June 24, 2019 - 22:30

ముంబైలో ఒక టూ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ కొన్నాల‌న్నా కోట్లు కావాలి. ఇక జుహూ, వ‌ర్లీ వంటి సంప‌న్న ప్రాంతాల్లో అయిదు నుంచి 10 కోట్లు పెట్టాల్సిందే. అలాంటి రిచ్ ఏరియాల్లో ఒక‌టి వార‌సోవా. ఐతే ఇక్క‌డ ఐదు కోట్ల రూపాయ‌ల్లోపే 2000 చ‌ద‌ర‌పు అడుగుల అపార్టమెంట్ వ‌స్తుంది. ఈ ఏరియాలో త‌మ‌న్న తాజాగా అపార్ట్మెంట్ కొనుక్కొంది. 

బేవ్యూ అనే ఒక పాత అపార్ట్‌మెంట్‌లో ఆమె 14వ అంత‌స్థులో 2055 చ‌ద‌ర‌పు అడుగుల త్రీబెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేసింది. ఈ అపార్ట్‌మెంట్‌కి ఆమె అక్ష‌రాలా 16 కోట్లు రూపాయ‌లు చెల్లించింద‌ట‌. స‌ముద్రం వ్యూతో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌ని త‌మ‌న్న ఏరికోరి కొనుక్కొంది. అదే ఏరియాలో అండ‌ర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఎస్‌.ఎఫ్‌.టికి 40వేలు ప‌లుకుతోంది. ఈ అమ్మ‌డు ఈ పాత అపార్ట్‌మెంట్‌ని ఎస్‌.ఎఫ్‌.టికి 80 వేల రూపాయ‌లు చెల్లించింది. ఆమెకిది బాగా న‌చ్చింద‌ట‌. అందుకే 7 కోట్ల రూపాయ‌ల‌కి కొనాల్సిన‌దాన్ని 16 కోట్ల రూపాయ‌లు ఇచ్చింది. 

మ‌రో రెండు కోట్ల రూపాయ‌లు పెట్టి మొత్తం రీమోడ‌ల్ చేయిస్తుంద‌ట‌. తెలుగు, త‌మిళ సినిమాల్లో సంపాదించిన డ‌బ్బుని ఇలా ఇన్వెస్ట్ చేస్తోంది. 

త‌మ‌న్న నటించిన సైరా సినిమా ఈ అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఈ ఏడాది ఎఫ్‌2 చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకొంది. తాజాగా మ‌రో భారీ చిత్రంలో న‌టించేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.