ఆ ఒక్కడికే ఇస్తా: తమన్న

Tamannah talks about her rules about kissing
Thursday, March 12, 2020 - 17:00

రీసెంట్ గా తమన్న ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. దాని సారాంశాన్ని పక్కనపెడితే.. అందులో ఆమె ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ మాత్రం ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. హీరో హృతిక్ రోషన్ కు లిప్ కిస్ ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించింది ఈ మిల్కీబ్యూటీ.

తమన్న వెండితెరపై లిప్ కిస్సులు పెట్టిన దాఖలాలు లేవు. భవిష్యత్తులో కూడా ఆమె లిప్ కిస్సులు పెట్టదు. ఓ సినిమాకు సైన్ చేసేటప్పుడే ఇలాంటి కొన్ని కండిషన్స్ ఆమె పెట్టుకొని సంతకం చేస్తుంది. అయితే ఒక్క హృతిక్ విషయంలో మాత్రం ఈ కండిషన్స్ ను పక్కనపెట్టేస్తానని చెబుతోంది తమ్ము.

హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం వస్తే, అందులో లిప్ కిస్ ఉన్నప్పటికీ ఓకే చెప్పేస్తానంటోంది. హృతిక్ ను ముద్దాడాలనే తన కోరికను అలా బయటపెట్టింది. ఇక తనకంటూ స్వయంవరం ప్రకటిస్తే.. అందులో హీరోల్ని కూడా చేరిస్తే.. అందులో కచ్చితంగా ప్రభాస్, విక్కీ కౌశల్, హృతిక్ ఉండాల్సిందేనంటోంది. మిల్కీబ్యూటీకి బాహుబలిపై ఏ మూలనో చిన్న లవ్ ఉన్నట్టే ఉంది.