శాకాహారిగా మారిన మిల్కీబ్యూటీ

Tamannah turns vegetarian
Monday, March 16, 2020 - 19:15

మిల్కీ బ్యూటీ తమన్నాకు నాన్-వెజ్ లో గ్రిల్డ్ వంటకాలంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని తను గతంలో ఓసారి చెప్పింది. కానీ ఇకపై తమ్మూ అలా చెప్పలేదు. ఎందుకంటే ఆమె పార్ట్-టైమ్ వెజిటేరియన్ గా మారింది. అవును.. ప్రస్తుతం శాకాహారం మాత్రమే తీసుకుంటోంది తమన్న. దీని వెనక ఓ కారణం ఉంది.

సీటీమార్ అనే సినిమా చేస్తోంది తమన్న. ఇందులో ఆమె కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె నాన్-వెజ్ మానేసిందట. జ్వాలా రెడ్డి అనే పాత్రను మరింత రక్తికట్టించడం కోసం తమన్న ఈ నిర్ణయం తీసుకుందట. తనకు ఎంతో ఇష్టమైన నాన్-వెజ్ ను వదిలేసిందట.

అంతా బాగానే ఉంది కానీ, కోచ్ పాత్ర కోసం నాన్-వెజ్ మానేయడం ఎందుకనేది ఇక్కడ ప్రశ్న. కోచ్ పాత్ర కాస్త స్లిమ్ గా ఉండాలని అనుకున్నా, తమన్న స్లిమ్ గానే ఉంటుంది కదా. పోనీ ఆమె గ్లామర్ కోసం అలా చేసిందా అంటే ఇప్పటికిప్పుడు ఆమె అందంపై విమర్శలేం లేవు. మరి ఎందుకు ఉన్నఫలంగా నాన్-వెజ్ మానేసిందో తమన్నాకే తెలియాలి.