తమన్న టైమ్ తిరిగిందా

Tamannah's good luck in 2019
Tuesday, March 19, 2019 - 15:45

తమన్న ఈ ఏడాది "ఎఫ్ 2" సినిమాతో భారీ విజయాన్ని అందుకొంది. వెంకటేష్ సరసన నటించి 80 కోట్ల బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకొంది. అలాగే తమిళంలో కూడా రీసెంట్‌గా ఒక హిటీని చూసింది. ఇటీవల విడుదలైన ఆ తమిళ సినిమాతో ఆమెకి నటిగా కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది. దాంతో ఈ బ్యూటీ ఖుషీఖుషీగా ఉంది
.
మొన్నటి వరకు ప్లాప్ లతో సతమతమయిన తమన్నకి 2019లో ఫేట్ టర్న్ అయినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది "సైరా"లోనూ, "దటీజ్ మహాలక్ష్మీ" సినిమాలతో మన ముందుకురానుంది. "సైరా"లో రెండో హీరోయిన్ పాత్ర. "దటీజ్ మహాలక్ష్మీ"లో ఆమెనే క్వీన్ (అవును ఈ సినిమా బాలీవుడ్ మూవీ "క్వీన్‌"కి రీమేక్‌)