ఇంకేం ఇంకేం కావాలిలా ఇది ఊపేనా?

Taxiwala song is getting Superb Response
Tuesday, October 30, 2018 - 22:30

"గీత గోవిందం" సినిమాలో "ఇంకేం ఇంకేం కావాలి" పాట సౌత్ ఇండియా అంతా ఊపేసింది. ఆ సినిమాకి అంత క్రేజ్ రావ‌డానికి అదొక కార‌ణం. సిద్ శ్రీరామ్ పాడిన ఆ పాట మిలియ‌న్ల కొద్దీ వ్యూస్‌ని పొందింది. ఇపుడు "ట్యాక్సీవాలా"లో "మాటే వినదుగా... " అంటూ సాగే పాటని కూడా అదే సింగ‌ర్ పాడాడు. ఈ పాట‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ పాట 2 మిలియన్ వ్యూస్ సంపాదించేందుకు ఏంతో టైం పట్టలేదు. ఈ పాట కూడా మెలోడియ‌స్‌గానే ఉంది.

గీత‌గోవిందంలోని "ఇంకేం ఇంకేం కావాలి" పాట‌లా ఇది కూడా ఊపేస్తుందా అనేది చూడాలి. 

గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో హిలేరియస్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించామ‌ని నిర్మాత ఎస్‌కేఎన్ అంటున్నారు. నవంబర్ 16న విడుద‌ల కానున్న ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వ‌స్తే నిర్మాత‌ల‌కి పంట ప‌డుతుంది. త‌క్కువ బ‌డ్జెట్‌లో తీసిన ఈ మూవీకి ఓపెనింగ్స్ చాలా కీల‌కం. అందుకే ఈ పాట‌ని బాగా ప్ర‌మోట్ చేస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ ఏడాది ఇప్ప‌టికే "మ‌హాన‌టి", "గీత‌గోవిందం", "నోటా" సినిమాలతో ప్రేక్ష‌కుల‌కి ముందుకొచ్చాడు.