బోల్డ్ టీజ‌ర్ల‌ ట్రెండ్ ఇది!

Teasers with bold content is in thing
Wednesday, November 7, 2018 - 17:30

"ఆర్ ఎక్స్ 100" సినిమా హిట్ట‌యిన‌ప్ప‌టి నుంచి సెక్స్ సీన్ల‌తో, ముద్దు సీన్ల‌తో కూడిన టీజ‌ర్ల‌ని విడుద‌ల చేయ‌డం ఒక ట్రెండ్ అయి కూర్చొంది. "ఆర్ ఎక్స్ 100" విజ‌యంలో సెక్స్ సీన్లు, ముద్దు సీన్లు కీల‌క పాత్ర పోషించిన మాట నిజ‌మే కానీ వాటివ‌ల్లే ఆ సినిమా ఆడ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలోనూ హీరోయిన్‌ని విల‌న్‌గా చూపించ‌లేదు. ఒక కొత్త కోణాన్ని ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి "ఆర్ ఎక్స్ 100"లో చూపించాడు. అందుకే యూత్‌కి అంత‌గా క‌నెక్ట్ అయింది.

ఐతే ఇపుడు ఆ పాయింట్‌ని వ‌దిలేసి బోల్డ్ కంటెంట్‌తో జ‌నాల్ని అట్రాక్ట్ చేసే ప‌నిలో ప‌డ్డారు. మొన్న"ర‌థం", "నాట‌కం" వంటి సినిమాలు ఇదే ప‌బ్లిసిటీ మంత్రాన్ని పాటించాయి కానీ బొక్కా బోర్లాప‌డ్డాయి. తాజాగా "ఏడు చేప‌ల క‌థ" అనే సినిమా మ‌రింత బోల్డ్‌గా టీజ‌ర్‌ని క‌ట్ చేసి  18 మిలియ‌న్స్  వ్యూస్ రాబ‌ట్టుకొంది.

ఇపుడు "రాయ‌ల‌సీమ ల‌వ్‌స్టోరీ" అనే సినిమా ఇదే పంథాని ఫాలో అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో ర‌క్త‌పు సినిమాలు చూశాం. ఈ సినిమాలో రంజైన ల‌వ్‌ని చూడ‌నున్నాం. జ‌నాల్ని అట్రాక్ట్ చేసేందుకు ఇలా బోల్డ్ పోస్ట‌ర్‌ని, టీజ‌ర్‌ని వ‌దిలింది టీమ్‌. ఈ టీజ‌ర్‌లో హీరో, హీరోయిన్ పెద‌వుల‌ను జుర్రుకోవ‌డాన్ని చూపించారు. ఇద్ద‌రి పెద‌వుల నుంచి కారుతున్న ఉమ్మిని కూడా చూపించ‌డం విశేషం.