తేజ కోరుకున్నా జ‌ర‌గ‌లేదు క‌దా

Teja wanted low ratings but
Thursday, May 30, 2019 - 18:15

దర్శకుడు తేజకి రాక రాక ఒక హిట్ వచ్చింది. అపుడెపుడో 15 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. మళ్లీ మొన్న "నేనే రాజు నేనే మంత్రి" సినిమాతో విజయం దక్కింది. అంతే... ఆ ఒక్క హిట్‌కే... ఆయన మాటలు కోటలు దాటాయి. "సీత" సినిమా విడుదలకి ముందు చాలా చెప్పాడు తేజ.

"జెర్సీ" సినిమాకి సూపర్ రేటింగ్స్ అంత ఇస్తే ఆ సినిమా ఆడలేదు...అదే "మజిలీ"కి తక్కువ రేటింగ్‌లు ఇచ్చినా సూపర్ హిట్టయిందని క్రిటిక్స్ కి సినిమా చూడడం రాదు అన్నట్లుగా మాట్లాడాడు.

జెర్సీ సినిమాలోని ఎమోషనల్ వాల్యూని, మూస సినిమా మజిలీకి లింక్ పెట్టాడు తేజ. అందుకే దయచేసి క్రిటిక్స్ ఎవరూ నా సినిమాకి మంచి రేటింగ్ ఇవ్వొద్దని వేడుకున్నాడు. అది ఆయన వ్యంగ్యంగా అన్నమాట. ఆయన మాటని క్రిటిక్స్ గౌరవించారు. "సీత" సినిమాని చీల్చి చెండాడి 2 రేటింగ్ ఇచ్చారు. అంటే వెరీ బ్యాడ్ మూవీ అని అర్థం.

క్రిటిక్స్ తక్కువ రేటింగ్ ఇస్తే తన సినిమా ఆడుతుందని భావించిన తేజకి తర్వాత చుక్కలు కనబడ్డాయి. ఇప్పటి వరకు హిట్ లేని బెల్లంకొండ కెరియర్‌లోనే అత్యంత దారుణమైన ఫ్లాప్‌గా నిలిచింది "సీత". దీన్ని బట్టి మిగతా మేటర్ ని మీరు ఊహించుకోవచ్చు.