మెగాస్టార్ కు హ్యాండ్ ఇచ్చిన తెలంగాణ మంత్రి

Telangana minister no to Chiru's event
Saturday, September 14, 2019 - 09:15

గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డేట్ ఎనౌన్స్ చేశారు. వేదికను కూడా ఫిక్స్ చేశారు. ప్రముఖుల పేర్లు కూడా అధికారికంగా బయటపెట్టారు. అంతలోనే ఓ ప్రముఖుడు రావడం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చుట్టూ జరుగుతున్న హంగామా ఇది. 18న ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కేటీఆర్ రావడం లేదు.

సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నాడు. పవన్ తో పాటు కొరటాల శివ, వినాయక్ లాంటి ప్రముఖులు వస్తున్నారు. మరోవైపు మెగా కాంపౌండ్ నుంచి మరికొంతమంది హీరోలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి కార్యక్రమానికి తన స్నేహితుడు కేటీఆర్ వస్తే బాగుంటుందని భావించాడు నిర్మాత రామ్ చరణ్. కేటీఆర్ కూడా ముందు ఓకే చెప్పారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే అధికారికంగా ప్రకటించారు. కానీ అంతలోనే కేటీఆర్ రావడం లేదంటూ మరో ప్రకటన విడుదల చేశారు.

రీసెంట్ గా మంత్రి అయ్యారు కేటీఆర్. దీంతో ఒక్కసారిగా బిజీ అయ్యారు. సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగబోయే రోజున అనుకోకుండా కొన్ని ముఖ్యమైన అధికారిక కార్యక్రమాలు ఫిక్స్ అయ్యాయి. దీంతో సైరా ఫంక్షన్ కు రావడం లేదని చరణ్ కు సమాచారం అందించారు కేటీఆర్.