అక్క‌డికెళ్లినా అదే గోకుడా?

Telugu actor overtures in USA
Tuesday, July 9, 2019 - 19:30

ఆ సీనియ‌ర్ న‌టుడి లీలలు హైద‌రాబాద్‌లో చాలామంది చెప్పుకుంటారు. రెండు పెగ్గులు వేశాకా....హ‌గ్గుల కోసం త‌హ‌త‌హ‌లాడుతాడ‌ని ఆ నోటా ఈ నోటా విన్న‌మాటే. ఐతే అమెరికా వెళ్లి అదే రంగం వేసి భంగప‌డ్డాడట‌.

అస‌లు మేట‌ర్ ఏంటంటే... ఒక సీనియ‌ర్ న‌టుడు ఇటీవ‌ల తానాలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాడు. తానాతో పాటు తందానా కూడా జ‌రుగుతుంది క‌దా. అదేనండి. తానా జ‌రిగిన సిటీకి ద‌గ్గ‌ర్లోనే మ‌రో తెలుగు సంస్థ కూడా ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. దానికి ఈయ‌న్ని గెస్ట్‌గా పిలిచింది. అది వారి సామాజిక వ‌ర్గానికి చెందిన ఏదో ఈవెంట్‌. ఈయ‌న ప్ర‌ముఖుడు కాబ‌ట్టి పిలిచార‌ట‌. ఐతే అక్కడ ఆఫ్ట‌ర్ పార్టీలో...అంద‌మైన మ‌హిళ‌ని చూసి ఏదో అన్నాడట‌?  వాళ్లు ఊరుకుంటారా? ఏమి చేయాలో అదే చేశార‌ట‌. దాంతో ఆ న‌టుడు ఘోర‌మైన అవ‌మానాన్ని అంద‌రి ముందే చూశాడ‌ని అమెరికాలో హెన్ కూడా కూస్తోంది. ఆ సౌండ్ హైద‌రాబాద్ వ‌ర‌కు వినిపిస్తోంది.

అందుకే పెద్ద‌లు అంటారు..ఏజ్‌, గేజ్ చూసుకొని, స‌మ‌యం సంద‌ర్బాన్ని బ‌ట్టి మెల‌గాల‌ని. లేదంటే రెస్పెక్ట్ రివ‌ర్‌లో కలుస్తుంది.