ఈ ఏడాది టాప్-10 టీఆర్పీ మూవీస్

Top rated movies on TV in 2019
Thursday, October 24, 2019 - 17:15

బాహుబలి వచ్చిన తర్వాత బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోయినట్టు.. ఇస్మార్ట్ శంకర్ వచ్చిన తర్వాత టెలివిజన్ టీఆర్పీ లెక్కలన్నీ మారిపోయాయి. థియేటర్లలో డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా బుల్లితెరపై మాత్రం పెద్దగా ఆడదని అంతా భావించారు. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్, జానర్ అలాంటిదంటూ వాదనలు తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉండే బుల్లితెరపై ఇస్మార్ట్ లాంటి మాస్ సినిమా ఆడదన్నారు. కానీ ఇస్మార్ట్ ఇరగదీశాడు. టీవీల్లో ఈ సినిమాకు ఏకంగా 16.63 (అర్బన్) రేటింగ్ వచ్చింది. ఇక హైదరాబాద్ లో అయితే ఈ సినిమాను ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఏకంగా 20.71 టీఆర్పీ వచ్చింది.

ఇస్మార్ట్ రాకతో టాప్-10 టీఆర్పీ రేటింగ్స్ లిస్ట్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది అత్యధిక టీఆర్పీ సాధించిన సినిమాల్లో రెండో స్థానానికి చేరింది ఇస్మార్ట్ శంకర్. మొదటి స్థానంలో ఎఫ్2 సినిమా నిలవగా.. ఇస్మార్ట్ దెబ్బకు కాంచన-3 మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఇస్మార్ట్ ప్రసారమైన రోజునే టెలికాస్ట్ అయిన వినయ విధేయ రామ సినిమా టీవీల్లో కూడా ఫ్లాప్ అనిపించుకుంది.

2019 టాప్-10 టీఆర్పీ సినిమాలు (అర్బన్)

  1. ఎఫ్ 2 - 17.2
  2. ఇస్మార్ట్ శంకర్ - 16.63
  3. కాంచన 3 - 13.10
  4. మహర్షి - 9.2
  5. ఓ బేబీ - 9
  6. జెర్సీ - 8.8
  7. మజిలీ - 8
  8. వినయ విధేయ రామ - 7.9
  9. సీత - 7.53
  10. 118 మూవీ - 6.33