త్రిష ఈసారి బుక్కయ్యేలా ఉంది

Trisha under fire from mega fans
Wednesday, April 22, 2020 - 17:00

చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో త్రిషను హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నారు. నటించడానికి ఆమె కూడా ఒప్పుకుంది. అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఆఖరి నిమిషంలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ పెద్దగా కోపం వ్యక్తం చేయలేదు. అయితే ఇప్పుడు త్రిష చేస్తున్న పనికి మాత్రం మెగాభిమానులకు కోపం కట్టలు తెంచుకోవడం ఖాయం. ఇంతకీ త్రిష ఏం చేయబోతోంది?

తెలుగులో చిరు సినిమాకు నో చెప్పిన ఈ చెన్నై బ్యూటీ.. ఇప్పుడు రవితేజ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉందట. త్వరలోనే రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రవితేజ. ప్రస్తుతం ఆ మూవీ ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమాలో రవితేజ సరసన నటించేందుకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.

ఇదే కనుక నిజమైతే ఈసారి త్రిషకు ట్రోలింగ్ తప్పకపోవచ్చు. చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న త్రిష, చిరంజీవి ఆఫర్ ను కాదని, రవితేజ సినిమాకు ఓకే చెబితే అది కచ్చితంగా ఆమెపై విమర్శలకు దారితీస్తుంది. ఆచార్య రిలీజ్ అయ్యేంతవరకు త్రిష మరో తెలుగు సినిమాకు కమిట్ అవ్వకుండా ఉంటేనే బెటర్ అంటున్నారు చాలామంది. నీకు అర్థమౌతోందా త్రిషా