అది లేకపోయినా ఇది పక్కా!?

Trivikram to announce something on NTR's birthday
Monday, April 20, 2020 - 00:15

ఒకే ఒక్క ప్రకటనతో ఎన్టీఆర్ అభిమానుల్ని తీవ్ర నిరాశలో ముంచేశాడు రాజమౌళి. ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఆర్ఆర్ఆర్ నుంచి టీజర్ కచ్చితంగా వస్తుందని చెప్పలేనంటూ బాంబ్ పేల్చాడు. ఈ బాధలో ఉన్న తారక్ అభిమానులకు సరిగ్గా 24 గంటలైనా గడవకముందే మరో గుడ్ న్యూస్ పలకరించింది. అదే త్రివిక్రమ్ సినిమా. తారక్ పుట్టినరోజుకు ఆర్ఆర్ఆర్ నుంచి ఫస్ట్ లుక్ వస్తుందో రాదో చెప్పలేం కానీ, త్రివిక్రమ్ నుంచి మాత్రం ఏదో ఒక హంగామా ఉండడం మాత్రం గ్యారెంటీ.

ఎన్టీఆర్ తో సినిమాకు సంబంధించి ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న త్రివిక్రమ్.. వచ్చేనెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజుకు సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వీటిలో ఒకటి టైటిల్ విడుదల. కుదిరితే ఆరోజున ఎన్టీఆర్-త్రివిక్రమ్ కొత్త సినిమా టైటిల్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఒకవేళ, ఇంత తొందరగా టైటిల్ బయటపెట్టడం ఇష్టంలేకపోతే.. సినిమా ఎప్పట్నుంచి సెట్స్ పైకి వెళ్తుందనే విషయాన్ని బయటపెట్టే అవకాశం ఉంది. దీంతో పాటు ఎన్టీఆర్ పై గతంలో తీసిన ఫొటో షూట్ నుంచి ఓ బ్రాండ్ న్యూ స్టిల్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఇలా తారక్ పుట్టినరోజుకు ఏదో ఒక హంగామా చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించాడు. అందులో కూడా తన మార్క్ ఉండాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ అనుకుంటున్నారు.