రావు ర‌మేష్ వ‌ల్ల ఎవ‌రికి న‌ష్టం

Trivikram least bothered about Rao Ramesh's exit
Tuesday, July 30, 2019 - 17:15

రావు ర‌మేష్ త్రివిక్రమ్ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆయ‌న స్థానంలో హ‌ర్ష వ‌ర్ధ‌న్ వ‌చ్చి చేరాడు. ఐతే రావు ర‌మేష్ వెళ్ల‌డం వ‌ల్ల బ‌న్ని - త్రివిక్ర‌మ్ సినిమాకి పెద్ద‌గా ఫ‌ర‌క్ ప‌డదేమీ లేదు. 

ఎలాంటి న‌టుల నుంచైనా బెస్ట్ యాక్టింగ్ రాబ‌ట్ట‌గ‌ల అతికొద్దిమంది తెలుగు ద‌ర్శ‌కుల్లో ఒక‌రు త్రివిక్ర‌మ్‌. ఒక‌పుడు ప్ర‌కాష్‌రాజ్ లేకుండా సినిమాలు చేసేవాడు కాదు త్రివిక్ర‌మ్‌. ప్ర‌కాష్‌రాజ్ ఇబ్బంది పెడుతున్నాడ‌ని అత‌న్ని త‌ప్పించి ఇత‌ర న‌టుల‌తో సినిమాలు తీయ‌డం మొదలుపెట్టాడు. అలా త్రివిక్ర‌మ్ సినిమాల్లో మంచి మంచి పాత్ర‌లు ద‌క్కించుకున్నాడు రావు ర‌మేష్‌. అత్తారింటికి దారేది కానీ, ఖలేజా కానీ, అఆ కానీ....ప్ర‌తి సినిమాలోనూ రావు ర‌మేష్ కోసం మంచి పాత్ర‌లు సృష్టించాడు త్రివిక్ర‌మ్‌.

అలాగే కొంత‌కాలంగా బొమ‌న్ ఇరానీ, రాజేంద్ర‌ప్రసాద్‌,  ఉపేంద్ర‌, న‌రేష్‌, తాజాగా స‌త్య‌రాజ్‌.. ఇలా ఇత‌ర మంచి న‌టుల‌తో వ‌ర్క్ చేస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. ప్ర‌కాష్‌రాజో, రావు ర‌మోషో మీదో డిపెండ్ కావాల్సిన అవ‌స‌రం లేదు ఆయ‌న‌కి.