అ సినిమాల‌ను చూస్తే జెల‌సీ పుడుతుంది!

Trivikram's fav Telugu movies in recent times
Tuesday, October 9, 2018 - 23:00

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌కి ఇటీవ‌ల విడుద‌లైన కొన్ని తెలుగు సినిమాల‌ను చూస్తే చాలా జెల‌సీ వేసింద‌ట‌. అలాంటి సినిమాల‌ను తాను ఎందుకు ఇప్ప‌టి వ‌ర‌కు తీయ‌లేక‌పోయాను అని సిగ్గుప‌డ్డ క్ష‌ణాలే అవే అంటున్నాడు. ముఖ్యంగా అర్జున్‌రెడ్డి, రంగ‌స్థ‌లం వంటి సినిమాలు చూసి స్ట‌న్ అయిపోయాడ‌ట‌. ఆ సినిమాల్లోని ఇంటెన్సిటీ, రా నెస్‌, డైర‌క్ట‌ర్ విజ‌న్ చూసి ఫిల్మ్‌ల‌వ‌ర్‌గా హై ఫీల‌య్యాడ‌ట‌. 

అర్జున్‌రెడ్డి, రంగ‌స్థ‌లం, పెళ్లి చూపులు, గూఢ‌చారి, కంచ‌ర‌పాలెం, ఆర్ ఎక్స్ 100 వంటి చిత్రాలు ఇటీవ‌ల కాలంలో త‌న‌ని చాలా క‌దిలించాయ‌ని చెప్పాడు. ఒక్కో సినిమాలో ఒక్కో క్వాలిటీ ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా ఇన్‌స్ప‌యిర్ చేశాయ‌ట‌. తెలుగు సినిమా చాలా మారుతోంద‌ని త్రివిక్ర‌మ్ చెపుతున్నాడు. 

తెలుగు సినిమాలు మెల్ల‌గా హాలీవుడ్ త‌ర‌హాలో జెన‌ర్ పంథాలోకి మారుతాయాని గ‌ట్టిగా న‌మ్ముతున్నాడు త్రివిక్ర‌మ్‌. కొన్నాళ్ల‌కి పాట‌లు, కామెడీ ట్రాక్‌లు లేకుండా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీయొచ్చు అంటున్నాడు త్రివిక్ర‌మ్‌. ఐతే ఆ ప‌ని ముందు ఎవ‌రు చేస్తారో చూడాలి అంటున్నాడు.