'నాన్న' సెంటిమెంట్ మెయిన్ కాదు!

Trivikram's Nanna sentiment
Thursday, April 11, 2019 - 11:15

త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇంతకుముందు "సన్నాఫ్ సత్యమూర్తి" సినిమా వచ్చింది. ఈ సినిమాలో  'నాన్న' సెంటిమెంట్. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన మొదటి మూవీ "నువ్వే నువ్వే"లో కూడా అదే సెంటిమెంట్. అందులో ప్రకాష్ రాజ్ - శ్రియ తండ్రిగా నటించారు. ఇక ఆయన రాసిన "నువ్వు నాకు నచ్చావు"లోనూ అది కనిపిస్తుంది చంద్రమోహన్ పాత్ర రూపంలో. 

ఇప్పుడు మళ్లీ అదే పంథాలో వెళ్తున్నారు అని టాక్. అయితే మీడియా లో వస్తున్న వార్తల్లో నిజం లేదంటోంది టీం. కథ ఆలా ఏమి ఉండదు అంట.  ఈ సినిమా ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్. 'నాన్న' సెంటిమెంట్ మెయిన్ థీమ్ కాదని చెప్తోంది టీం. నిజానిజాలు ఏంటనేది రిలీజ్ టైములో తెలుస్తాయి