ఇక ఆన్‌లైన్‌ టికెట్లు బంద్: తలసాని

TS govt proposes new ticket sales system
Saturday, September 21, 2019 - 20:00

తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలపై కొంత పట్టు సాధించే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. ఇష్టారాజ్యంగా టికెట్లని అమ్మకుండా చూసే పనిలో ఉన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్‌లు అమ్మే పద్దతని రద్దు చేస్తామంటున్నారు తెలుంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 

ప్రభుత్వమే అధికారికంగా సినిమా టికెట్ల అమ్మకాల కోసం ప్లాన్‌ రెడీ చేసిందట. ప్రభుత్వం వెబ్‌సైట్‌ రన్‌ చేయనుంది. దానివల్ల ఏ సినిమాకి ఎంత రెవిన్యూ వచ్చిందనేది ఎప్పటికపుడు పక్కాగా లెక్క ఉంటుంది. దొంగ లెక్కలు, దొంగ కలెక్షన్లకి ఇక తెరపడుతుంది. థియేటర్లలో 18 నుంచి 20 లైన్లు, 8 నుంచి 10 వరుసల సిట్టింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి వివరించారు. అయితే ఇది ఎపుడు కార్యరూపం దాల్చుతుందనేది ఇపుడే చెప్పలేం.