టీవీ సీరియ‌ల్ న‌టి ఝాన్సీ ఆత్మ‌హ‌త్య‌

TV serial actress Jhansi commits suicide
Wednesday, February 6, 2019 - 10:00

ప్రేమ వ్య‌వ‌హారంలో మోస‌పోయాన‌నే కార‌ణంతో బుల్లితెర న‌టి ఝాన్సీ ఆత్మ‌హ‌త్య చేసుకొంది. శ్రీనగర్ కాలనీలో అద్దెకుంటున్న త‌న అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఝాన్సీ. మాటీవీలో ప్ర‌సారం అయిన పవిత్రబంధం సీరియల్ లో నటించింది.

సూర్య అలియాస్ నాని అనే వ్యక్తి మోసం చేసాడని సూసైడ్ నోట్‌లో పేర్కొంది ఆ న‌టి. ఆత్మహత్య కంటే ముందు సూర్య అనే వ్యక్తి తో ఝాన్సీ వాట్స్ ఆప్ చాట్ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. సూర్య తో పరిచయం అనంతరం సీరియల్స్ కు దూరంగా ఉంటోంద‌ట‌.

ఆమె స్వస్థలం కృష్ణ జిల్లా ముద్దెనెపల్లి మండలం వాడాలి గ్రామం. ఝాన్సీ సెల్ ఫోన్ సీజ్ చేసి కేసు న‌మోదు చేసిన పోలీసులు. అయితే ఆమె ప్రేమ వ్యవహారం తమకేమీ తెలియదంటున్నారు ఝాన్సీ తల్లి. ఈ నెల 22వ తేదీ మా ఊరిలో గృహప్రవేశం ఉంది. ఊరికి వెళ్లాల్సి ఉంది ఈలోగా ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఝాన్సీ తో పాటు మా అబ్బాయి ఇద్దరు మాత్రమే ఉన్నారు. సూర్య ఎవరో నాకు తెలియదు... ప్రేమ వ్యవహారం, సహజీవనం విషయం తెలియదు... అని ఝాన్సీ త‌ల్లి మీడియాకి తెలిపారు.