ఉద‌య్‌తో ఐశ్వ‌ర్యా రాజేష్‌

Uday Shankar's second movie
Monday, January 21, 2019 - 16:15

చంద్ర‌సిద్దార్థ్ తీసిన "ఆట గదరా శివ"తో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు ఉద‌య్ శంక‌ర్‌. అత‌ని రెండో చిత్రం తాజాగా ప్రారంభం అయింది. త‌మిళ‌నాట త‌క్కువ కాలంలోనే చాలా పేరు తెచ్చుకున్న న‌టి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.  తమిళనాట హీరో విజయ్ ఆంటోనితో 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం.

ఈ చిత్రం హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియో లో ప్రారంభమయింది. రామా నాయుడు స్థూడియోలో వైభవంగా ప్రారంభమైన ఈ చిత్రం  వేడుకకు ప్రముఖ నిర్మాత  శ్రీ  అల్లు అరవింద్, జెమిని కిరణ్,శరత్ మరార్, ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్ధ, కరుణాకరన్, కిషోర్ పార్ధసాని (డాలి), జొన్నలగడ్డ శ్రీనివాసరావు, శ్రీరామ్ బాలాజీ, సంగీత దర్శకుడు కోటి, ప్రొఫెసర్ జి. శ్రీరాములు తదితరులు విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

 ఎన్నో ఘనవిజయం సాధించిన చిత్రాలకు కధలందించిన ప్రముఖ రచయిత భూపతిరాజా  ఈ చిత్రానికి కథ నందించారు.  క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కుటుంబ కధా చిత్రమిదని దర్శకుడు ఎన్ వి.నిర్మల్ కుమార్  తెలిపారు.