తమన్నకి చరణ్ భార్య స్పెషల్ గిఫ్ట్

Upasana presents ring to Tamannah
Thursday, October 3, 2019 - 23:30

రచ్చ సినిమాలో రామ్ చరణ్, తమన్న చూపించిన కెమిస్ట్రీ అట్లాంటి ఇట్లాంటిది కాదు. ఇద్దరిది సూపర్ జోడి. ఆ జోడిని, ఆ కెమిస్ట్రీ ని చూసి చరణ్ భార్య జెలస్ ఫీల్ అవుతుంది అనుకుంటే పొరపాటే. చరణ్ భార్య ఉపాసన, తమన్న రియల్ లైఫ్ లో క్లోజ్ ఫ్రెండ్స్.  అందుకే.. ఆమెని తన తండ్రి సరసన 'సైరా'లో నటింప చేశాడు రామ్ చరణ్. కొణిదెల వారి ఫ్యామిలీ ఫ్రెండ్ గా మారిపోయింది తమ్ము. 

ఇక 'సైరా'లో ఆమె నటనకి ఉపాసన ఫిదా అయిపోయింది. ఫస్ట్ డే సినిమా చూసిన తర్వాత తమన్నాని ఇంటికి పిలిపించుకొని మరి ఒక ఖరీదైన డైమండ్ రింగుని ప్రెజెంట్ చేసింది ఉపాసన. ఆ విషయాన్ని ఆమె తెలిపింది. "నిర్మాత మిస్సెస్ నుంచి సూపర్ టాలెంటెడ్ తమన్నాకి ఒక బహుమతి," అంటూ ఫోటోని షేర్ చేసింది ఉపాసన. 

తమన్న ...మెగా హీరోల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ (కెమరామెన్ గంగతో రాంబాబు), చరణ్ (రచ్చ), అల్లు అర్జున్ లతో నటించింది.