అమెరికాలో వెంకీ కలెక్షన్లు మాయం

US distributor not posting Venky Mama collections
Monday, December 16, 2019 - 15:15

"వెంకీ మామ" ఇండియాలో తొలి వీకెండ్ అదరగొట్టింది. మంచి హిట్ దిశగా దూసుకెళ్తోంది. ఆంధ్ర, తెలంగాణల్లో 17 కోట్లపైన వసూళ్లు అందుకొని బాక్స్ ఆఫీస్ కి ఊపు తెచ్చింది. అయితే ... తొలి వీకెండ్ అమెరికాలో వసూళ్లు ఎంత అన్నది తెలియడం లేదు. ఎందుకంటే.. డిస్ట్రిబ్యూటర్ వసూళ్లు బయటికి రాకుండా చేశారు. డిస్ట్రిబ్యూటర్ ఈ కలెక్షన్లని దాచే ప్రయత్నం చేస్తున్నారు. 

ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమా తొలి వీకెండ్ బాగా ఆడింది. అయితే అమెరికాలో మాత్రం అంతగా కలెక్షన్లు లేనట్లున్నాయి. దాంతో... డిస్ట్రిబ్యూటర్ ఈ ఆప్షన్ ఎంచుకున్నారు. భారీ మొత్తంలో వసూళ్లు వస్తే... ఆటోమేటిక్ గా కాం స్కోర్ (గతంలో దీని పేరు రేంట్రాక్) సంస్థ అప్డేట్ చేస్తుంది. ఇలా తక్కువగా వచ్చే సినిమాలకి తెలుగు డిస్ట్రిబ్యూటర్లు ఇదే పద్ధతి ఫాలో అవుతారా?

ఇటీవల అమెరికా మార్కెట్ బాగా దెబ్బ తిన్నది. అక్కడి వారు అంత ...అమెజాన్ ప్రైమ్ లో వచ్చినప్పుడు చూద్దాం లే అన్నట్లుగా ఉన్నారు. దానికి తోడు గతంలో మూవీ పాస్ అనే సిస్టం ఉండేది. అదిప్పుడు లేదు.. దాంతో థియేటర్ల వైపు తెలుగు వాళ్ళు చూపు వెయ్యడం లేదు. అమెరికా మార్కెట్ ముందు ముందు ఎలా ఉంటుంది అనేది 2020లో తేలుతుంది.