ఫేవర్ చేస్తే అఫర్ ఇస్తారా: వాణి

Vani Bhojan talks about casting couch experience
Tuesday, March 17, 2020 - 11:30

ఆమధ్య బాలీవుడ్-టాలీవుడ్-కోలీవుడ్ ను ఓ ఊపు ఊపిన మీటూ మూమెంట్ అప్పుడప్పుడు తెరపైకి వస్తూనే ఉంది. ఓ రాత్రి గడపమని డిమాండ్ చేశారంటూ ఆరోపణలు చేయడానికి హీరోయిన్లు ఇప్పుడు ఏమాత్రం వెనకాడ్డం లేదు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ వాణి భోజన్ కూడా చేరింది.

"మీకు మాత్రమే చెప్తా" సినిమాతో పాపులర్ అయిన ఈ తమిళ నటి.. తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. ఓ నిర్మాతతో తనకు ఫేవర్ చేయాలని అడిగాడని, అప్పుడు మాత్రమే ఆపర్ ఇస్తానని చెప్పాడంది వాణిభోజన్. అయితే అప్పుడు తనకు ఫేవర్ అనే పదానికి అర్థం తెలియలేదని, తర్వాత కొన్ని రోజులకు తనతో పడుకోవాలని నిర్మాత నేరుగా అడగడంతో అవాక్కయి అక్కడ్నుంచి వచ్చేశానని తెలిపింది.

తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన వాణిభోజన్, అక్కడే సినిమాలు కూడా చేసింది. తర్వాత టాలీవుడ్ కు వచ్చింది. తన టాలెంట్ గుర్తించి తనకు అవకాశం ఇస్తే చేస్తానని, ఇలాంటి చాటుమాటు వ్యవహారాలు మాత్రం తన వద్ద కుదరవని ఓపెన్ గా చెబుతోంది వాణిభోజన్. ఇన్ని విషయాలు చెప్పిన ఈ అమ్మాయి.. తనను రాత్రికి రమ్మని పిలిచిన ఆ నిర్మాత పేరు, ఆ సినిమా సంగతులు మాత్రం బయటపెట్టలేదు.