బాల‌య్య చిత్రంలో లేడీ విల‌న్ కాదు

Varalakshmi Sharat Kumar not villain in NBK's film
Saturday, May 11, 2019 - 23:45

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న కొత్త సినిమాలో లేడీ విల‌న్ ఫిక్స్ అయిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ట‌. వర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఈ మూవీలో ఉండ‌బోతున్న మాట వాస్త‌వ‌మే కానీ ఆమెది నెగిటివ్ రోల్ కాద‌ని టీమ్ వ‌ర్గాల మాట‌.

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సీ క‌ల్యాణ్ కొత్త సినిమాని నిర్మిస్తున్నాడు. జై సింహా కాంబినేష‌న్ ఇది. ఈ సినిమా ఈ నెల 17న లాంఛ‌నంగా లాంచ్ కానుంది. వ‌చ్చే నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఇటీవ‌ల త‌మిళ చిత్రాల్లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ నెగిటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లు ఎక్కువ‌గా చేస్తోంది. స‌ర్కార్‌, పందెంకోడి 2 వంటి సినిమాల్లో అలా న‌టించింది. బాల‌య్య లాంటి సీనియ‌ర్‌ హీరో స‌ర‌స‌న లేడీ విల‌న్ అంటే బాగోద‌ని టీమ్ భావిస్తోంది. అందుకే వ‌ర‌ల‌క్ష్మీకి అలాంటి పాత్ర ఇవ్వ‌డం లేద‌ట‌.