హ్యండిచ్చిన బాలయ్య‌, ఓటేసిన వెంకీ!

Venkatesh says yes to Vinayak's movie?
Tuesday, January 1, 2019 - 22:45

ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వినాయక్‌కి ఎదురుదెబ్బే త‌గిలింది. నంద‌మూరి బాల‌కృష్ణ ఊరించి ఊరించి చివ‌రికి హ్యండిచ్చాడు. బాల‌య్య‌కి క‌థ న‌చ్చితే చాలు .. డైర‌క్ట‌ర్ హిట్‌లో ఉన్నాడా, ప్లాఫ్‌ల్లో ఉన్నాడా అనేది చూడ‌ర‌ని అంటారు. అందుకే మొద‌ట బాల‌య్య వినాయ‌క్ చెప్పిన ప్ర‌పోజ‌ల్‌కి ఓకే చెప్పారు. ఐతే తీరా సెట్‌కి తీసుకెల్దామ‌ని వినాయ‌క్ భావిస్తున్న టైమ్‌లో బాల‌య్య‌.. త‌న త‌దుప‌రి చిత్రంగా బోయ‌పాటి డైర‌క్ష‌న్‌లో సినిమా మొద‌ల‌వుతుంద‌నీ, ఫిబ్ర‌వ‌రి నుంచే ఉంటుంద‌నీ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

బాల‌య్య‌తో సినిమా ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మ‌ని వినాయ‌క్ అర్థం చేసుకున్నాడు. ఇంటిలిజెంట్ వంటి ఇడియాటిక్ సినిమా తీసిన త‌ర్వాత వినాయ‌క్ హీరోల‌ను ఒప్పించ‌డం క‌ష్టంగా మారింది. ప్లాఫ్‌ల క‌న్నా ఆ సినిమా టేకింగ్ చూసిన ఏ హీరో అయినా ద‌డుసుకుంటాడు. ఐతే వినాయ‌క్ ఇపుడు వెంకీని ఆల్మోస్ట్ ఒప్పించ‌న‌ట్లు టాక్ న‌డుస్తోంది.

గ‌తంలో వెంకీకి పాత చింత‌కాయ ప‌చ్చ‌డి క‌థ‌తోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ (ల‌క్ష్మీ) అందించాడు వినాయ‌క్‌. అందుకే, వెంకీ వినాయ‌క్‌కి మ‌రోసారి చాన్స్ ఇస్తున్నాడ‌నేది ఫిల్మ్‌న‌గ‌ర్ పుకారు. మ‌రి ఇది నిజ‌మ‌వుతుందా? వినాయ‌క్ విక్ట‌రీ అందుకుంటాడా?